హైదరాబాద్ మెట్రో రికార్డు నెలకొల్పింది. వినాయక నిమజ్జనం సందర్భంగా ఒక్క రోజే 4 లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకున్నారని మెట్రో అథారిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. నాగోల్- రాయదుర్గం కారిడార్ లో 1.49 లక్షలు, మియాపూర్- ఎల్బీనగర్ కారిడార్ లో 2.46 లక్షలు, జేబీఎస్- ఎంజీబీఎస్ కారిడార్ లో 22 వేల మంది ప్రయాణికులు ప్రయాణించారని లెక్క తేల్చింది. అత్యధికంగా ఖైరతాబాద్ స్టేషన్ లో నే 22 వేల మంది రైలు ఎక్కగా… 40 వేల మంది రైలు దిగారు. సిటీలో గణేశ్ నిమజ్జనం సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో సిటీ బస్సులు, మెట్రో రైల్వేలను ఆశ్రయించాలని, దీని ద్వారా ట్రాఫిక్ కష్టాలుండవని పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో అథారిటీ నిమజ్జనం రోజు అర్ధరాత్రి 2 గంటల వరకూ సర్వీసులు నడిపింది.