న్యూజీలాండ్ కేంద్రంగా 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నది. ఈ నెల 17-18 తేదీలు, వచ్చే నెల రెండో తేదీన ఈ సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ నెల సెప్టెంబర్ 17-18, మరియు అక్టోబర్ 2, 2022 తేదీలలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సమగ్ర ప్రకటనను కార్యవర్గ సభ్యులు విడుదల చేసారు . ఆక్లాండ్ (న్యూజీలాండ్) కేంద్రం గా జరుగుతున్నా ఈ కార్యక్రమములో ముఖ్య అతిధులుగా ప్రముఖ గేయ రచయత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ రచయత ఓలేటి పార్వతీశం ప్రత్యక్షంగా పాల్గొనబోతుండగా, అంతర్జాల వేదిక ద్వారా ప్రముఖ గేయ రచయత భువనచంద్ర, ప్రముఖ నటులు, రచయత తనికెళ్ళ భరణి, ప్రముఖ రచయత డేనియల్ నైజర్స్ (ఫ్రాన్స్ ) పాల్గొనపోతున్నారు. ఆహూతుల సమక్షంలో ప్రారంభ వేదిక, ఒక పురస్కార వేదికా, రెండు ప్రసంగ వేదికలూ ప్రత్యక్షంగానూ, అంతర్జాలం కేంద్రంగా 14 ప్రసంగ వేదికలూ, ఒక పురస్కార వేదిక వెరసి… 36 గంటల తెలుగు సాహిత్య ప్రసంగాలు జరుగుతున్నాయి.. వీటితో పాటు జీవన సాఫల్య పురస్కారములను కొమరవోలు సరోజ (కెనడా), ఓలేటి పార్వతీశం (భారతదేశం) ప్రదానం చేయనున్నారు.
అక్లాండ్ కేంద్రంగా జరుగుతున్న ఈ సాహితీ సదస్సులో ముఖ్య అతిధులుగా ప్రముఖ గేయ రచయత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ రచయిత ఓలేటి పార్వతీశం ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. ఇంటర్నెట్ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా ప్రముఖ గేయ రచయత భువనచంద్ర, ప్రముఖ నటుడు-రచయత తనికెళ్ళ భరణి, ప్రముఖ రచయత డేనియల్ నైజర్స్ (ఫ్రాన్స్ ) పాల్గొంటారు.
కార్యక్రమమును ఈ క్రింది ప్రసార మాధ్యమాలలో చూసి ఆనందించమని కోరుతున్నాం.
YouTube Links (updated):
Vanguri Foundation of America https://bit.ly/3epi8Do
Vamsee Art Theaters https://youtu.be/l1mQdnZk-Eo
Sri Samskruthika Kalasaradhi https://youtu.be/jfa9D9GuSE8
Telugu Malli https://youtu.be/XGcsW-cnnkA
Veedhi Arugu https://youtu.be/T579HfPhBVI
Telugu Talli Canada https://youtu.be/6N-Q6QdvOeo
Singapore Telugu TV https://youtu.be/CkW8fnk8T6s
Malaysia Telugu Sangham