ప్రభుత్వ పాఠశాల టీచర్ల పదోన్నతుల షెడ్యూల్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్ 2 ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ల పదోన్నతుల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల ప్రాథమిక సీనియారిటీ జాబితాను ఈ నెల 7 న వెబ్ సైట్ లో వుంచుతామని పేర్కొన్నారు. వీటిపై వున్న అభ్యంతరాలను ఆన్ లైన్ ద్వారా 8 వ తేదీలోగా తెలపాలని అధికారులు కోరారు. తుది సీనియారిటీ జాబితాను 10 న విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.
