మునుగోడు బైపోల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బైపోల్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, హరీశ్, జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందని లోతుగా చర్చించారు. ఇక పూర్తిగా ప్రచార పర్వంలోకి దిగాలని ఈ ముగ్గురు మంత్రులను సీఎం ఆదేశించారు.
మరోవైపు మునుగోడులో ప్రస్తుత వాతావరణం, సర్వేలపై కూడా చర్చ జరిగింది. ఇక… దసరా రోజున మునుగోడు అభ్యర్థిని సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. ఇక.. దసరా తర్వాత ఒక్కో యూనిట్ కు ఒక్కో ఎమ్మెల్యే ఇన్ ఛార్జీగా వ్యవహరిస్తారని, దసరా తర్వాత వీరంతా తమకు కేటాయించిన బాధ్యతల్లోకి వెళ్తారని పార్టీ వర్గాలు అంటున్నారు.