మహారాష్ట్రలో కాంగ్రెస్ కి బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ సీఎం అశోక్ చవాన్?

మహారాష్ట్రలో కాంగ్రెస్ కి భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే సీఎం షిందే, బీజేపీ నేతలతో ఆయన చర్చలు కూడా జరుపుతున్నారు. కొన్ని రోజులుగా అశోక్ చవాన్ కు, అధిష్ఠానానికి ఏమాత్రం పొసగడం లేదని, అందుకే పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ… చవాన్ గనక బీజేపీలో చేరితే.. మహారాష్ట్రలో కాంగ్రెస్ కి పెద్ద షాకే అవుతుంది.

 

చవాన్ కుటుంబం అంతా గాంధీ కుటుంబానికి సన్నిహితులుగానే వున్నారు. అంతేకాకుండా సీఎం షిండే నుంచి చవాన్ కు ఓ రిటర్న్ గిఫ్ట్ కూడా దొరికినట్లు ప్రచారం జరుగుతోంది. చవాన్ నియోజకవర్గానికి కీలకమైన వాటర్ గ్రిడ్ ను సీఎం షిండే మంజూరు చేశారు. దాదాపు 728 కోట్లు విలువ చేసే ఈ గ్రిడ్ 183 గ్రామాల తాగునీటి సౌకర్యాన్ని తీరుస్తుంది. ఇంతటి కీలకమైన దానిని సీఎం షిండే మంజూరు చేశారు.

 

 

జూన్ లో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకాంత్ హందోరే ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఈయన గెలుస్తారని అందరూ అనుకున్నారు కానీ.. ఓటమి పాలయ్యారు. భారీ ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందని, అందుకే ఓడిపోయారని కూడా ప్రచారంలో వుంది. అక్కడే చవాన్ బీజేపీలోకి రావడానికి బీజం పడిందని అంటున్నారు. మరోవైపు వున్న సీట్ల కంటే ఎక్కువ మందిని బరిలోకి దింపిన బీజేపీ.. ఘన విజయం సాధించింది. దీంతో మహా వికాస్ అగాఢీకి చుక్కెదురైంది. అంతేకాకుండా సరిగ్గా సభలో విశ్వాస పరీక్ష జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ కి చెందిన 10 మంది సభ్యులు సభకు చాలా ఆలస్యంగా వచ్చారు. ఈ 10 మందిలో చవాన్ కూడా వున్నారు. ఈ పరిణామాలను లెక్కలోకి తీసుకొని, చవాన్ అతి త్వరలోనే పార్టీ మారతారని అంటున్నారు.

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం