ఇప్పటికీ ఆంధ్రలో సీఎం కేసీఆర్ పై వ్యతిరేకత వుంది… కొడాలి నాని

తెలంగాణ సీఎం కేసీఆర్ నూతనంగా ప్రారంభించిన బీఆర్ఎస్ జాతీయ పార్టీపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఏపీలో బీఆర్ఎస్ మనుగడ అనే విషయానికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. ఇప్పటికే 2 సార్లు సీఎం అయిన కేసీఆర్.. ప్రధాని కావాలని ఆరాటపడుతున్నారేమోనని చురకలంటించారు. అయితే.. రాజకీయాల్లో ఏదైనా, ఎప్పుడైనా సాధ్యమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రజల విషయంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని, ఆయనపై ఆంధ్రలో వ్యతిరేకత వుందని స్పష్టం చేశారు. పోటీ చేసే సమయంలో ఆయన పార్టీకి కార్యకర్తలు, నేతలు దొరకుతారా? ఎంత మంది దొరుకుతారు? ఎంత మంది పోటీ చేస్తారు? అనేది కాలమే నిర్ణయిస్తుందన్నారు.

 

 

ఇక… ప్రపంచంలో ఏ దేశంలోనూ రాజధాని నిర్మించిన చరిత్ర లేదని కొడాలి నాని అన్నారు. రాజధాని నిర్మాణం అన్న విషయాన్ని తెచ్చింది చంద్రబాబే అని ఎద్దేవా చేశారు. అన్ని సౌకర్యాలు, మొత్తం వెసులుబాటు వున్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని, అక్కడి నుంచి పాలన కొనసాగిస్తే అదే రాజధాని అవుతుందన్నారు. అదే ప్రాంతాన్ని కొంత డెవలప్ చేసి, పెద్ద నగరంగా మారితే.. పరిశ్రమలు ఏర్పడి మహా నగరాలు అవుతాయని కొడాలి నాని విశ్లేషించారు.

Related Posts

Latest News Updates