సీఎం కేసీఆర్ నేడు యూపీకి వెళ్తున్నారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొంటారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. అక్కడి నుంచి ములాయం సింగ్ యాదవ్ సొంత గ్రామానికి చేరుకుంటారు. అంత్యక్రియల్లో పాల్గొని.. సీఎం కేసీఆర్ తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో 3 రోజుల పాటు బస చేయనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ ను కాస్తా.. బీఆర్ఎస్ గా మార్చిన పక్షంలో పలువురు జాతీయ నేతలను సీఎం కలవనున్నట్లు తెలుస్తోంది. వారితో భవిష్యత్ కార్యాచరణను చర్చించనున్నట్లు సమాచారం.