యూకే ప్రధానిగా గెలిచేదెవరు?

యూకే ప్రధాని ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు తమ ఓటును కొందరు పోస్టల్‌లో, మరి కొందరు ఆన్‌లైన్‌లో వేశారు. ఈ నెల 5వ తేదీన  ఫలితం వెలువడనున్నది. కాగా ప్రధాని ఎవరని టోరీ నేతలు మాత్రం చర్చించుకోవడం లేదు. ఎందుకంటే వారంతా ఎవరికీ ఓటేయాలనుకుంటున్నారో ఫిక్న్‌ అయినట్టు  వారి ప్రవర్తనను బట్టి తెలుస్తోంది. ప్రధాని ఎన్నికల చ్రారంలో అభ్యర్థులు మాత్రమే కాకుండా పరోక్షంగా బోరిస్‌ జాన్సన్‌ కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే అడికి (సునక్‌) తప్ప ఎవరికైనా ఓటేయండన్న బోరిస్‌ సూచనలు నిజం కానున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. టోరి నేతలు ఎవరికి ఓటేయాలో ఇప్పటికే ఇన్‌స్ట్రక్షన్‌ వెళ్లాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.  2 లక్షల మంది టోరీ సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ప్రధాని ఎవరో వారి ఓట్లు తేల్చనున్నాయి.  10 డౌన్‌ స్ట్రీట్‌ నుంచి తాను వెళ్లిపోయేలా చేసిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో గెలవకుండా చేయాలని బోరిస్‌ శపథం చేసినట్లు తెలుస్తోంది. దీంతో టోరీ నేతలు అందుకు అనుగుణంగానే కాబోయే ప్రధానికి ఓటేసినట్టు సమాచారం.  కాగా లిజ్‌ ట్రస్‌, సునక్‌ మధ్య వెస్ట్‌ మిస్టర్‌లో జరిగే కార్యక్రమంలో బ్యాలెట్‌ ఫలితం ప్రకటించనున్నారు.  అయితే పార్టీ చీఫ్‌, ప్రధానమంత్రి ఎవరు కానున్నారో ఇప్పటికే అర్థమైందని కొంతమంది గుసగుసలాడుతున్నారు.

Related Posts

Latest News Updates