భారత జాతీయ భాషగా సంస్కృతాన్ని ప్రకటించాలంటూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అంశాన్ని పరిశీలించడానికి కోర్టు సరైన వేదిక కాదని పేర్కొంది. ఈ అభ్యర్థనను పార్లమెంటులో లేవనెత్తాలి గానీ, కోర్టుల్లో కాదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మీ అభ్యర్థనను సంస్కృతంలో రాయండి. ప్రచారం కోసం నోటీసులు జారీ చేయడం గానీ, ప్రకటనలు చేయడం గానీ ఎందుకు? మీ అభిప్రాయాల్లో కొన్నింటితో మేము ఏకీభవించొచ్చు. కానీ ఈ అంశాన్ని చర్చించడానికి సరైన వేదిక పార్లమెంట్. దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. ఇది పాలసీలకు సంబంధించిన విషయం. దీనిని మేం మార్చలేం అని న్యాయస్థానం పేర్కొంది. అనంతరం ఈ పిల్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ పిల్‌ను గుజరాత్ మాజీ అదనపు సెక్రటరీ కె.జి.వంజార దాఖలు చేశారు. హిందీతో పటు సంస్కృతాన్ని కూడా జాతీయ భాషగా పేర్కొనాలని కోరారు.