ఉద్దవ్ ఠాక్రే, ఏక్‌నాథ్‌ షిండే లకు… కేంద్ర ఎన్నికల సంఘం షాక్

మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ కీలక పరిణామం జరిగింది. శివసేన పార్టీ గుర్తు విషయంలో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాలకు ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. అంధేరి తూర్పు అసెంబ్లీ ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో శివసేన పార్టీ గుర్తును తమకు కేటాయించాలని షిండే వర్గం ఈసీని కోరింది. అయితే శివసేన గుర్తు అడిగే హక్కు షిండే వర్గానికి లేదని, పార్టీ నుంచి బయటకు వెళ్లినవారికి గుర్తు అడిగే హక్కు లేని ఉద్ధవ్ వర్గం స్పష్టంచేసింది. శివసేనకు ఇప్పటిదాకా కొనసాగుతున్న ఎన్నికల గుర్తు విల్లంబును ఇరు వర్గాలూ వినియోగించడం కుదరదని ఎన్నికల సంఘం తెలిపింది. రెండు వర్గాల మధ్య వివాదం తేలే దాకా ఈ గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్లు కమిషన్ తెలిపింది. అంతేకాకుండా త్వరలో జరిగే ఉప ఎన్నికకు రెండు వర్గాలు తమ తమ గుర్తులను ఎంచుకోవాలని… అది కూడా రెండు రోజుల్లోగా స్పందనను తెలియజేయాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.

Related Posts

Latest News Updates