అమెరికాలోని టీఎక్స్ స్టేట్ గవర్నర్ గ్రెగ్ అబాట్, అతని భార్య సిసిలియాతో కలిసి కొంత మంది భారతీయులు దీపావళి పండగను ఘనంగా జరుపుకున్నారు. ఆస్టిన్ లోని గవర్నర్స్ మాన్షన్ లో ఆహ్వానింపబడిన కొంద్ది భారతీయులతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ తోటకూర ప్రసాద్ తో పాటు పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబాట్ మాట్లాడుతూ.. కాంతుల పండగ దీపావళి అని, ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.