బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికై.. రికార్డు నెలకొల్పారు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా వున్న నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో భాగంగా అల్లుడి విజయంపై రిషి సునాక్ మామయ్య, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కూడా స్పందించారు. ఈ సందర్భంగా సునాక్ కు శుభాకాంక్షలు ప్రకటించారు. అల్లుడి విజయంపై చాలా గర్వంగా వుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక.. యూకే ప్రజలకు అనుగుణంగానే తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి. నారాయణ మూర్తి కుమార్తె ఈమె. స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలో ఎంబీఏ చదివే సమయంలో రిషితో అక్షతాకు పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. పెద్దలు అంగీకరించడంతో పెళ్లి చేసుకున్నారు.