గుంటూరు లో ప్టాస్టిక్ వ్యర్థాల గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం..

ఏపీలో తాజాగా మరో అగ్ని ప్రమాదం సంభవించింది. గుంటూరు జిల్లా ఏటుకూరు రోడ్డులోని ఆర్ఎస్ పాలీమర్స్ ప్లాస్టిక్ వ్యర్థాల గోడౌన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా 50 లక్షల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే… ఈ ప్రమాదం గురించి తెలుసుకోగానే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. వెంటనే అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. దాదాపు 2 గంటల పాటు శ్రమించి, మంటలను అదుపు చేశారు. దీపావళి రోజునే విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు.

Related Posts

Latest News Updates