సీఎం మమతకు ఝలక్… పార్టీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను అరెస్ట్ చేసిన ఈడీ

సీఎం మమతా బెనర్జీకి మరో ఝలక్ తగిలింది. పాఠశాల ఉపాధ్యాయ నియామక అవకతవకల్లో టీఎంసీకి చెందిన మరో ఎమ్మెల్యేను ఈడీ అరెస్ట్ చేసింది. టీఎంసీ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను ఈడీ అరెస్ట్ చేసింది. ఉపాధ్యాయుల నియామకాల అవినీతిలో భాగంగా ఈడీ అధికారులు సోమవారం విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లు నేడు ప్రకటించారు. మరోవైపు భట్టాచార్య ఇంటి నుంచి ఈడీ అధికారులు రిక్రూట్ మెంట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అవినీతి జరిగిన సమయంలో భట్టాచార్య బెంగాల్ ప్రాథమిక విద్యా బోర్డు అధ్యక్షుడిగా పనిచేశారు. కోల్‌కతా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో అతని పేరు ప్రస్తావించారు. కోర్టు ఆదేశంతో గత కొన్ని రోజుల క్రితమే భట్టాచార్యను విద్యా బోర్డు అధ్యక్ష పదవి నుంచి తొలగించారు.

 

 

ఈ ఉపాధ్యాయుల అవకతవకల్లో అరెస్టైన రెండో ఎమ్మెల్యే ఈయన. మొదట మంత్రి పార్థా ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా.. ఎమ్మెల్యే భట్టాచార్యను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నిందితులుగా ఉండగా… గత కొన్ని రోజుల క్రితం వీరి ఇళ్లల్లో దాడులు చేసిన ఈడీ… రూ.50 కోట్లకు పైగా విలువైన కరెన్సీ నోట్ల కట్టలు, భారీగా బంగారం, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.

Related Posts

Latest News Updates