అమెరికా టెక్సాస్ లో రోడ్డు ప్రమాదం… ముగ్గురు తెలుగువారి దుర్మరణం

అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వారు దుర్మరణం పాలయ్యారు. తానా బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య, ఇద్దరు కుమార్తెలు ఈ ప్రమాదంలో చనిపోయారు. శ్రీనివాస్ భార్య వాణి కాలేజీ నుంచి కుమార్తెలను తీసుకురావడానికి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో టెక్సాస్ లో వారు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాను బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వీరిది కృష్ణా జిల్లా పామర్రు మండలం. కొన్నేళ్ల క్రితమే వీరి కుటుంబం ఉద్యోగ రీత్యా హ్యూస్టన్ లో స్థిరపడింది.

Related Posts

Latest News Updates