నందిగ్రామ్ లో జరిగిన సహకారం సంఘం ఎన్నికల్లో అధికార టీఎంసీకి భారీ ఝలక్ తగిలింది. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. మొత్తం 12 సీట్లకు గాను.. బీజేపీ 11 సీట్లను కైవసం చేసుకుంది. జయ కేతనం ఎగురవేసింది. మరో వైపు టీఎంసీ ఈ ఎన్నికల్లో ఒక్క సీటుకు మాత్రమే పరిమితమైంది. 2021లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై గెలిచి సంచలనం సృష్టించారు. మళ్లీ ఇప్పుడు మమతకు, ఆమె సారధ్యంలోని టీఎంసీకి గట్టి షాకిచ్చారు.