వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐకి, ఏపీ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూతురు సునీత లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. తమకు ఏపీ(AP)లో నిర్వహిస్తున్న విచారణపై నమ్మకం లేదని.. దర్యాప్తు సంస్థ అధికారులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని.. కాబట్టి ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసి, తదుపరి దర్యాప్తు చేపట్టాలని సుప్రీంలో పిటిషన్ వేశారు.

 

సునీత దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. సునీత తరపున సీనియర్‌ న్యాయవాది సిద్దార్ధ లూత్రావాదనలు వినిపించారు. విచారణ సాగకుండా… దర్యాప్తు సంస్థ అధికారులు, సాక్షులను బెదిరిస్తున్నారని ధర్మాసనానికి సిద్దార్థ వెల్లడించారు. తదుపరి విచారణను వచ్చే నెల 14 వ తేదీకి వాయిదా వేశారు.

Related Posts

Latest News Updates