ఆగస్టు 26 ను ‘తానా అశోక్ కొల్లా డే’గా గుర్తిస్తూ ప్రకటన

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆగస్టు 26ను ఇకపై ‘తానా-అశోక్ కొల్లా డే’‌గా గుర్తిస్తున్నట్టు ఒహాయో రాష్ట్రంలోని ఆక్రాన్ నగర మేయర్ డేనియల్ హోరిగన్ తాజాగా ప్రకటించారు. తెలుగు ప్రజలకే కాకుండా.. ఆక్రాన్ నగర పౌరులకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా తానా ఈ గౌరవం దక్కించుకుంది. క కరోనా సంక్షోభ సమయంలో తానా సంఘంతో పాటూ ఆశోక్ కొల్లా.. నార్త్‌ఈస్ట్ ఒహాయోలో అనేక మందికి ఉచితంగా భోజనం అందించారు. అంతేకాకుండా.. కొవిడ్ టెస్టింగ్ కేంద్రాల ఏర్పాటు, ఉచిత కొవిడ్ కిట్లు, పీపీఈ కిట్ల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలను చేపట్టారు. అశోక్ కొల్లా ప్రస్తుతం తానా కోశాధికారిగా పని చేస్తున్నారు.

Related Posts

Latest News Updates