కెనడా కాల్గరీలోని శ్రీ అనఘా దత్త సొసైటీలో (శ్రీ సాయి బాబా మందిరం) గణపతి నవరాత్రుల సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ నిర్మాతలు లలిత, శైలేష్, వేద పండితుడు ఆలయ ప్రధాన అర్చకుడు రాజకుమార్ శర్మ.. అనేక మంది వాలంటీర్లతో వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. 400 మందికి పైగా భక్తులు మేళ తాళాలతో, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, భగవన్నామ స్మరణలో పాల్గొన్నారు. ‘గణపతి ఉత్సవ ఊరేగింపు’ అందరినీ ఆకట్టుకుంది.
ఈ ఉత్సవంలో కెనడా పార్లమెంటు సభ్యుడు జస్రాజ్ హల్లాన్ పాల్గొని కార్యక్రమ నిర్వాహకులను, హాజరైన వారిని అభినందించారు. ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన, గురువందనం, చతుర్వేద పారాయణం, వినాయక చవితి పూజలు సంప్రదాయ బద్దంగా జరిగాయి. పంచాయతన పూజలు, యాగాలు నిత్య పూజలను శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రధాన నిర్వాహకులు లలిత, శైలేష్ గణపతి నవరాత్రుల వేడుకలను ఘనంగా నిర్వహించారు.