వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి.. స్వాంటె పాబోకు దక్కిన నోబెల్

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారం ఈ సారి వైద్య రంగానికి దక్కింది. వైద్యశాస్త్రం లో విశేష కృషి చేసినందుకు గాను ఈ ఏడాది స్వాంటె పాబోకు నోబెల్ పురస్కారం లభించింది. మానవ పరిణామ క్రమం, అంతరించి పోయిన హొమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను ఆయనకు నోబెల్ దక్కింది. అంతరించిపోయిన నియాండెర్తల్ జన్యువును పాబో సీక్వెన్స్‌ చేయడంతోపాటు గతంలో ఎవరికీ తెలియని హోమినిన్ డెనిసోవాకు సంబంధించి సంచలనాత్మక ఆవిష్కరణ చేశారు.

 

దాదాపు 70 వేల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన తర్వాత ప్రస్తుతం అంతరించిపోయిన ఈ హోమినిన్‌ల నుంచి హోమో సేపియన్లకు జన్యు బదిలీ జరిగిందని పాబో కనుగొన్నారు. వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన.. మరో వారం పాటు కొనసాగుతుందని నోబెల్ జ్యూరీ పేర్కొంది. రేపు భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్య విభాగాలను ప్రకటిస్తామని తెలిపింది. శుక్రవారం నాడు నోబెల్ శాంతి బహుమతి, 10న అర్థశాస్త్రంలో గ్రహీతల పేర్లు ప్రకటిస్తారు.

 

 

Related Posts

Latest News Updates