ఈ మధ్య ఆప్ గుజరాత్ పై కన్నేసింది. తరుచుగా ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ తరుచుకుగా గుజరాత్ ను సందర్శిస్తున్నారు. బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. ఇక.. మూడు పర్యాయాలు ఇప్పటికే బీజేపీ అక్కడ అధికారంలో వుంది. మరోసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారోనని ఉత్కంఠత నెలకొంది. పైగా అది ప్రధాని మోదీ సొంత రాష్ట్రం. ఈ నేపథ్యంలో ఏబీపీ న్యూస్ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. గుజరాత్ లో మళ్లీ బీజేపీయే గెలుస్తుందని అందులో తేలింది. మొత్తం 182 సీట్లు వుండగా.. బీజేపీకి 135 నుంచి 143 సీట్లు వస్తాయని ఆ సర్వే తెలిపింది. అయితే.. ఆప్ కు గణనీయమైన ఓట్లు వచ్చినా.. 2 సీట్లకే పరిమితం అవుతుందని ఒపీనియన్ పోల్స్ లో వెల్లడైంది. ఇక.. కాంగ్రెస్ 36 నుంచి 44 స్థానాలను గెలుచుకుందని తెలిసింది.