రామోజీరావుకు, ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీ రావుకు, ఏపీ ప్రభుత్వానికి మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో సుప్రీం కోర్టు నోటీసులిచ్చింది. 4 వారాల్లోనే జవాబివ్వాలని సుప్రీం ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. చట్ట నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్ తో పాటు రామోజీ రావును ప్రాసిక్యూట్ చేయాలంటూ నాంపల్లి మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన ఫిర్యాదును కొట్టేస్తూ, ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీం స్పందించింది.

 

డిపాజిట్ హిందు అవిభాజ్య కుటుంబం పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్​ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. 2018 డిసెంబర్ 31న ఉమ్మడి ఏపీ హైకోర్టు ఈ పిటిషన్​ను కొట్టేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఇందులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్​ అయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది. మార్గదర్శి వ్యవహారంలో రామోజీరావు సైతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుర్యకాంత్ బెంచ్ సోమవారం విచారణ జరిపింది.

Related Posts

Latest News Updates