హిజాబ్ విషయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. దుస్తులు ధరించే హక్కు వుందంటే… విప్పే హక్కూ వున్నట్లేనా? అంటూ కర్నాటక పాఠశాలల్లో హిజబ్ ఆంక్షలపై వ్యాఖ్యానించింది. హిజాబ్ పై దాఖలైన పిటిషన్లపై విచారణ చేస్తూ సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని అనుమతినిస్తూ కేంద్రీయ విద్యాలయాలు జారీ చేసిన ఉత్తర్వులను పిటిషనర్ల తరపున న్యాయవాది ఉదహరించారు. ఈ మాట రాగానే… ధర్మాసనం జోక్యం చేసుకుంది. హిజాబ్ ను ఎవ్వరూ నిషేధించలేదు. పాఠశాలల్లో మాత్రమే నిషేధించారు. మిగతా చోట్ల మీకు కావాల్సిన చోట ధరించవచ్చు అని పేర్కంది. మతపరమైన అంశాలకు సంబంధించి ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయని, స్కూల్లో అందరు విద్యార్థులు ఒకే యూనిఫాం ధరించాల్సి ఉంటుందని బెంచ్ పేర్కొంది. విచారణకు న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.
