అమిత్ షా భద్రతలో వైఫల్యం… హోంశాఖ సిబ్బంది అంటూ వ్యక్తి చక్కర్లు

కేంద్ర హోం మంత్రి ముంబై పర్యటనలో భద్రతా లోపం బయటపడింది. సోమవారం ముంబైలో అమిత్‌ షా పర్యటించారు. ఈ సమయంలో హోం శాఖ అధికారినని చెప్పుకొంటూ.. అమిత్‌ షా వెంట ఓ వ్యక్తి తిరగడం కలకలం రేపింది. అతన్ని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వ్యక్తి ఆంధ్రాకు చెందిన ఓ ఎంపీ పర్సనల్ సెక్రటరీగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అమిత్ షా మహారాష్ట్ర పర్యటనలో వున్న సమయంలో ఓ వ్యక్తి హోంశాఖ ఐడీ కార్డుతో అమిత్ షా కు అతి సన్నిహితంగా తిరుగుతూ వున్నాడు. ఈ విషయాన్ని ఆయన భద్రతా అధికారులు గుర్తుపట్టి, వెంటనే ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే… అతని పేరు హేమంత్ పవార్ అని, భద్రతా లిస్టులో ఆయన పేరే లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో… హేమంత్ పవార్ పై ఐపీసీ 170,71 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Related Posts