సుమంత్ ప్రభాస్, సుభాష్ చంద్ర, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

తన తొలి మూవీ ‘మేం ఫేమస్‌’తో లీడ్ యాక్టర్, దర్శకుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా తన రెండో మూవీని అనౌన్స్ చేశారు. ఈ కొత్త మూవీ రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ మేడిన్ వెంచర్. MR ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈరోజు రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు హీరో శ్రీవిష్ణు క్లాప్‌ కొట్టారు, సురేష్‌బాబు కెమెరా స్విచాన్‌ చేశారు. దర్శకులు శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్, మహేష్ బాబు పి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ని అల్లు అరవింద్ మేకర్స్‌కి అందజేశారు. ఈ వేడుకకు సునీల్ నారంగ్ కూడా హాజరయ్యారు. యంగ్ టీం సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగాలని అతిథులందరూ ఆశీర్వదించారు.

మేం ఫేమస్ సక్సెస్ తర్వాత సుమంత్ ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రకరకాల కథలు విన్నారు. అయితే, అందులో ఏదీ కనెక్టింగ్ గా అనిపించలేదు. ఒకానొక సమయంలో, తనే కథను రాసి దర్శకత్వం వహించాలని కూడా ఆలోచించారు. ఇలాంటి సమయంలో ఈ స్క్రిప్ట్‌తో సుభాష్‌చంద్ర అతనిని సంప్రదించినప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని భావించారు. ఈ ప్రాజెక్ట్‌కి ఆమోదం తెలిపే ముందు ఈ యంగ్ హీరో దాదాపు 86కి పైగా కథలు విన్నారు, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడంలో అతను తీసుకునే కేర్ ని ఇది హైలైట్ చేస్తుంది.

నిధి ప్రదీప్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. జగపతి బాబు మేజర్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రీను & రోహిత్ కృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ మూవీ యూత్‌ఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ, ఇది బిగ్ స్క్రీన్స్ కు సరికొత్త ఎక్స్ పీరియన్స్ తీసుకువస్తుంది. పశ్చిమగోదావరి ప్రాంతంలోని విజువల్ బ్యూటీని ప్రజెంట్ చేసే ఈ చిత్రాన్ని భీమవరం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు.

టీమ్ ఇప్పటికే కాస్టింగ్ కాల్‌ను అనౌన్స్ చేయగా, దీనికి ఔత్సాహిక నటీనటుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రానికి సాయి సంతోష్ సినిమాటోగ్రఫీని, నాగ వంశీ కృష్ణ సంగీత అందిస్తున్నారు, ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య, ఎడిటర్ అనిల్ కుమార్ పి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

మూవీ లాంచింగ్ ఈవెంట్ లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన గెస్ట్ లందరికీ చాలా థాంక్స్. నేను చేసిన ఫస్ట్ సినిమా ‘మేం ఫేమస్’ నీ అందరూ చాలా గొప్పగా ఆదరించారు. నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలని ఏడాదిన్నరగా అలోచించాను. చాలా కథలు విన్నాను. కథలు ఎక్కడో మనసుకు నచ్చలేదు. అలాంటి సమయంలో ఈ సినిమా రైటర్, డైరెక్టర్ సుభాష్ చంద్ర వచ్చి ఈ కథ చెప్పారు. ప్యూర్ ఆంధ్ర, భీమవరం వైబ్ లో అద్భుతంగా వుంది. అభినవ్ అన్న చాలా పాషనెట్ ప్రొడ్యూసర్. చాలా మంచి కథ తీసుకోచ్చారు. ఈ సినిమాని అందరూ ఆదరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ సో మచ్’ అన్నారు.

హీరోయిన్ నిధి ప్రదీప్.. అందరికీ నమస్కారం. ఈ ప్రాజెక్ట్ లో పార్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి థాంక్యూ సో మచ్. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం కావడం చాలా హ్యాపీగా ఉంది. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’ అన్నారు.

డైరెక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. అతిథులందరికీ థాంక్యూ సో మచ్. ఇది అమ్మ ప్రేమ లాంటి ఒక చక్కటి ఊరు కథ. గోదారి గట్టున కూర్చొని ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా అంత హాయిగా ఉంటుంది. ఇందులో రెండు ప్రేమ కథలు ఉన్నాయి. సుమంత్, హీరోయిన్ ది ఒక లవ్ స్టోరీ అయితే, తండ్రి కూతుర్లది ఒక లవ్ స్టోరీ. నిర్మాత అభినవ్ గారికి థాంక్యూ సో మచ్. ఆయన దాదాపుగా వంద కథలు పైగా విన్నారు. ఈ కథ ఆయనకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఫాదర్ క్యారెక్టర్ జగపతి బాబు గారు చేస్తున్నారు. ఆయనకి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది అందరికీ నచ్చే సినిమా’అన్నారు.

నటీనటులు: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రీను, రోహిత్ కృష్ణ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం – సుభాష్ చంద్ర
బ్యానర్ – రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
డీవోపీ – సాయి సంతోష్
సంగీతం – నాగ వంశీ కృష్ణ
ఎడిటర్ – అనిల్ కుమార్ పి
ప్రొడక్షన్ డిజైనర్ – ప్రవల్య
సౌండ్ డిజైనర్ – నాగార్జున తాళ్లపల్లి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మధులిక సంచన లంక
పీఆర్వో – వంశీ-శేఖర్
మార్కెటింగ్ – ఫస్ట్ షో

Related Posts

Latest News Updates