ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ‘పుష్ప-2 ది రూల్‌’ లో మాసివ్‌ ”కిస్సిక్‌” సాంగ్‌ కోసం డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల

శ్రీలీల డ్యాన్సుల్లో తనదైన స్టయిల్‌, తనకంటూ ఓ పత్యేక మార్క్‌ క్రియేట్‌ చేసుకుని, నటనలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటనతో పాటు డ్యాన్సింగ్‌లో కూడా వన్‌ ఆఫ్‌ ద ఫైనెస్ట్‌ ఇండియన్‌ డ్యాన్సర్‌గా ఉన్న ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌తో.. డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల జతకడుతోంది.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇండియన్‌ ఫిల్మ్‌ పుష్ప-2 ది రూల్‌ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, కథానాయిక శ్రీలీలపై ఓ స్పెషల్‌ మాసివ్‌ కిస్సిక్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్‌ అధికారికంగా విడుదల చేశారు. ఐకాన్‌ స్టార్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకుడు.సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ఈ ప్రెస్టేజియస్‌ ఇండియన్‌ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచానాలు తారాస్థాయిలో వున్నాయి. సినిమాలో కంటెంట్‌ కూడా అంతకు మించి అస్సలు తగ్గేదేలా అనే విధంగా వుండబోతుంది. ఇక పుష్ప ది రైజ్‌ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-సమంతలపై చిత్రీకరించిన ఊ అంటావా మామా ఊఊ అంటావా సాంగ్‌ జాతీయ స్థాయిలో ఎంత పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు తాజాగా పుష్ప-2 దిరూల్‌లో చిత్రీకరిస్తున్న ఈ మాసివ్‌ నెంబర్‌ దానికి మించి ఉండబోతుంది. ఈ మాసివ్‌ కిస్సిక్‌ సాంగ్‌లో ఐకాన్‌ స్టార్‌ సూపర్భ్‌ డ్యాన్స్, ఆయన స్వాగ్‌ ఆయన అభిమానులను, ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్స్‌ను పాట్నా, కలకత్తా, చెన్నయ్‌, కొచ్చి, బెంగళూరు, ముంబయ్‌ హైదరాబాద్‌లో ఈ మాసివ్‌గా నిర్వహించబోతున్నారు.ప్రస్తుతం ఒకవైపు చివరి దశలో వున్న చిత్రీకరణతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులను ఈ చిత్రం జరుపుకుంటోంది. ఇక బాక్సీఫీస్‌ రికార్డులను రూపుమాపడానికి, ఇండియాను కలెక్షన్ల తుఫాన్‌ షేక్‌ చేయడానికి ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌- బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల వండర్‌ఫుల్‌ ఫిల్మ్‌ పుష్ప-2 ది రూల్‌ సర్వాంగ సుందరగా ముస్తాబు అవుతుంది.

Related Posts

Latest News Updates