మహేష్ బాబు SSMB 29 మూవీలో బాలీవుడ్ బ్యూటీ..దీపిక పదుకొణె? ఎస్ ఎస్ రాజమౌళి స్కెచ్

సూపర్‌స్టార్ మ‌హేష్ తో సినిమాకు దర్శకుధీరుడు రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఈ సినిమాను ప్రపంచస్థాయిలో డిజైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అదేవిధంగా మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సూపర్‌స్టార్ మ‌హేష్-దర్శకుధీరుడు రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి టాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె పేరును జక్కన్న పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్కిప్ట్ దశలో ఉండగా.. ఇప్పుడే యాక్టర్స్‌ డేట్స్ కూడా లాక్ చేసుకుంటే బెటర్ అని భావిస్తున్నారట. భారీ ప్రాజెక్ట్ కావడంతో ముండే డేట్స్ ఒకే అనుకుంటే.. షూటింగ్ ప్రారంభ సమయానికి ఎలాంటి సమస్యలుండవని అనుకుంటున్నారట. ప్రస్తుతం ప్రభాస్ సరసన ప్రాజెక్ట్-కె మూవీలో దీపికా పదుకుణె హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ఇక రాజమౌళి కాల్షీట్లు అడిగితే ఈ బ్యూటీ కచ్చితంగా ఒకే చెబుతుందని విశ్లేషకులు అంటున్నారు. 2023లో ఈ మూవీ SSMB 29గా సెట్స్‌పై వెళ్లనుంది. ప్రస్తుతం తండ్రి విజ‌యేంద్ర ప్రసాద్ తో కలిసి జక్కన్న స్కిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ బాబు SSMB 28 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ కాగానే.. రాజమౌళి కాంపౌండ్‌లో అడుగుపెట్టనున్నాడు. SSMB 29 సినిమా గురించి టోరంటో ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో రాజమౌళి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన విషయం తెలసిందే. మ‌హేష్‌తో గ్లోబ‌ల్ మూవీగా, యాక్షన్ అడ్వెంచ‌ర‌స్ జోన‌ర్‌లో రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ న్యూస్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. భారీ యాక్షన్ మూవీ అని జక్కన్న చెప్పేయడంతో.. పాన్ వరల్డ్ స్థాయిలో మహేష్ బాబు క్రేజ్ పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు.

Related Posts

Latest News Updates