ఏడు దశాబ్దాల తర్వాత భారత్ గడ్డపై చీతాలు అడుగుపెట్టాయి. నమీబియా నుంచి ఎనిమిది చీతాలు ప్రత్యేక విమానంలో మధ్యప్రదేశ్‌కు చేరుకున్నాయి. ఇందులో మూడిరటిని కునో జాతీయ పార్కు (కేఎన్‌పీ)లోని స్పెషల్ ఎన్‌క్లోజర్స్‌కి ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 7 దశాబ్దాల తర్వాత చీతాలు మన గడ్డపై అడుగుపెట్టాయని, ఇదొక చారిత్రక క్షణమని పేర్కొన్నారు.