కర్నాటక వద్ద ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న సోనియా గాంధీ..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర కర్నాటకలో కొనసాగుతోంది. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేడు కర్నాటకలోని మాండ్య జక్కనహళ్లి ప్రాంతంలో పాదయాత్రలో పాల్గొన్నారు. ఉదయం 6:30 కల్లా పాండవ పుర గ్రామానికి చేరుకున్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీతో కలిసి నడుస్తూ… పాదయాత్రలో పాల్గొన్నారు.

 

సోనియా, రాహుల్ తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంజలి నింబాల్కర్, రూపకలా, లక్ష్మీ హెబ్బాల్కర్ కూడా పాల్గొన్నారు. మరోవైపు బళ్లారిలో జరిగే ర్యాలీలో సోనియా గాంధీ ప్రసంగించే అవకాశాలున్నాయి. ఇక.. సరిగ్గా సోమవారానికి భారత్ జోడో యాత్ర మైసూరుకు చేరుకుంది. విజయ దశమి పర్వదినం సందర్భంగా రెండు రోజుల పాటు బ్రేక్ పడింది. తిరిగి నేడు ప్రారంభమైంది.

 

Related Posts

Latest News Updates