పీఎఫ్ఐ కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లపై ఎన్ఐఏ మరోసారి విరుచుకుపడుతోంది. తాజాగా… నేటి ఉదయం 5 గంటల నుంచే 8 రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు చేస్తోంది. 170 మంది పీఎఫ్ఐ నేతలను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.అందులో 8 మంది అసోం నుంచి అరెస్ట్ అయ్యారు. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, అసోం, కర్నాటక, ఢిల్లీ, మహారాష్ట్రలో ఎన్ఐఏ దాడులు చేస్తోంది. ఈ ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు బృందాలుగా విడివడి… 200 చోట్ల దాడులు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఎన్ఐఏ దేశవ్యాప్తంగా దాడులు చేసి, 106 మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ చేసిన వారిని విచారణ కూడా చేస్తున్నారు. వారిచ్చిన సమాచారం ఆధారంగానే ఈ రెండో రౌండ్ దాడులు చేస్తున్నారు. మరికొంత మందిని కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసే ఛాన్స్ వుందని సమాచారం.