హిజాబ్ విషయంలో సుప్రీంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కర్నాటక విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించే విషయంలో సుప్రీం కోర్టు భిన్నమైన తీర్పును వెలువరించింది. హిజాబ్ పై 10 రోజుల పాటు దీనిపై విచారణ జరిపిన జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాంశు ధూలియా ధర్మాసనం హిజాబ్ ధారణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. హిజాబ్ ధారణను నిషేధించడాన్ని జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా… మరో జస్టిస్ ధూలియా తిరస్కరించారు. దీంతో తుది తీర్పు కోసం సీజేఐ యూయూ లలిత్ ధర్మాసనానికి ఈ కేసును సిఫార్సు చేస్తున్నట్లు జస్టిస్ హేమంత్ గుప్తా వెల్లడించారు.