పాక్ లో ఘోర బస్సు ప్రమాదం… బస్సులో చెలరేగిన మంటలు.. 17 మంది సజీవ దహనం

పాకిస్తాన్ లో ఘోరమైన బస్సు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగడంతో 17 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కరాచీలోని ఎం9 మోటార్ హైవే వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే.. ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారంతా వరద బాధితులే కావడం అత్యంత విషాదకరం. వరదల కారణంగా వారికి కరాచీలోని షెల్టర్ క్యాంపు నుంచి తిరిగి స్వగ్రామానికి వస్తున్నవారే. ఈ సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రకటించారు. బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని, పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

 

 

 

 

Related Posts

Latest News Updates