‘మండల్’ రాజకీయ యోధుడు ములాయం సింగ్ కన్నుమూత…

మండల్ రాజకీయ యోధుడు, మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ (82) నేడు తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సమాజ్ వాదీ అధ్యక్షుడు, ఆయన కుమారుడు అఖిలేశ్ వెల్లడించారు. మా నాన్న, మనందరి నేతాజీ ఇక లేరు అంటూ ములాయం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22 నుంచి ములాయం ఆస్పత్రిలోనే వున్నారు. గత వారం ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో వైద్యులు ఆయన్ను ఐసీయూకి తరలించారు.

 

 

అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే మనుగడ సాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ కి ఫోన్ చేసి… ములాయం ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఏ అవసరం వున్నా… కేంద్రాన్ని సంప్రదించాలని, సహాయం అందించేందుకు రెడీగా వున్నామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీతో సహా యూపీ సీఎం యోగి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్, తెలంగాణ సీఎం కేసీఆర్ తదితరులు ములాయం ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక… ములాయం అంత్యక్రియలు ఆయన సొంత గ్రామమైన సైఫయిలో జరుగుతాయని అఖిలేశ్ ప్రకటించారు. మరోవైపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని యూపీ సీఎం యోగి ఆదేశించారు.

 

1939 నవంబర్ 22 న యూపీలో ఇటావా జిల్లా సైఫై గ్రామంలో జన్మించారు. 1967 లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైలు జీవితం గడిపారు. 1989 లో జనతాదళ్ నుంచి తొలిసారిగా యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇ తర్వాత అంటే.. 1992 లో సమాజ్ వాదీ పార్టీని స్థాపించి, వేరు కుంపటి పెట్టుకున్నారు. తన రాజకీయ జీవితంలో మొత్తం 10 సార్లు ఎమ్మెల్యేగా, 8 సార్లు ఎంపీగా పనిచేశారు. అంతేకాకుండా 3 సార్లు సీఎంగా పనిచేశారు. కేంద్రంలో రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు.

 

గతంలో ములాయం సింగ్‌ కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆయన్ను అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడుతున్నాయి. దీనికి తోడు…రెండో భార్య మరణం కూడా ఆయన్ను తీవ్రంగా కుంగదీసింది. వీటి కారణంగానే క్రియాశీల రాజకీయాలకు ములాయం దూరంగానే ఉన్నారు. దీంతో కుమారుడు అఖిలేష్ యాదవ్ అన్నీ తానై పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్ మరోసారి ఎన్నికయ్యారు.

 

Related Posts

Latest News Updates

నవంబర్ 9న హార్ట్‌ల్యాండ్ ఆఫ్ ఇండియా ల‌క్నోలో గ్రాండ్ లెవ‌ల్లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, దిల్ రాజు కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ టీజర్ రిలీజ్‌కు రంగం సిద్దం