ములాయం మరణం బాధించింది… బాంధవ్యాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ

మాజీ సీఎం, సమాజ్ వాదీ మార్గదర్శకుడు ములాయం యాదవ్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయనతో వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మోదీ ట్వీట్ చేశారు. ములాయం సింగ్ అత్యంత నిరాడంబరమైన మనిషి అని, ప్రజల సమస్యల పట్ల సున్నితంగా స్పందిస్తారని పేర్కొన్నారు. ములాయం యూపీ సీఎంగా వున్న సమయంలో చాలా సార్లు ఆయనతో మాట్లాడానని గుర్తు చేసుకున్నారు. ఈ అనుబంధం ఇలాగే కొనసాగిందని, ఆయన అభిప్రాయాలను వినడానికి ఎప్పుడూ రెడీగానే వుండేవాడినని అన్నారు. శ్రద్ధతో ఆయన ప్రజలకు ఎంతో సేవ చేశారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, లోహియా సిద్ధాంతాలను వ్యాప్తి చేయడంలో ఆయన జీవితాన్ని అర్పించారని అన్నారు. ములాయం మరణం తననెంతో బాధించిందని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. వారి కుటుంబీకులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు తెలిపారు.

 

 

మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ (82) నేడు తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సమాజ్ వాదీ అధ్యక్షుడు, ఆయన కుమారుడు అఖిలేశ్ వెల్లడించారు. మా నాన్న, మనందరి నేతాజీ ఇక లేరు అంటూ ములాయం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22 నుంచి ములాయం ఆస్పత్రిలోనే వున్నారు. గత వారం ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో వైద్యులు ఆయన్ను ఐసీయూకి తరలించారు.

Related Posts

Latest News Updates