వారం రోజుల పాటు రోడ్ కమ్ రైల్ వంతెన మూసివేత…

నేటి నుంచి వారం రోజుల పాటు రాజమండ్రిలోని రోడ్ కమ్ రైలు వంతెనపై రాకపోకలను నిషేధిస్తున్నారు. ఈ విషయాన్ని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరమ్మతుల కోసం వంతెనను మూసేస్తున్నామని ఆయన ప్రకటించారు. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ, గామన్ వంతెన మీదుగా వాహనాలను మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. అయితే అమరావతికి మద్దతుగా రైతులు చేపట్టిన పాదయాత్ర ఈ నెల 17 న ఈ వంతెన మీదుగానే వెళ్లనుంది. అందుకే ఇలా చేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

Related Posts

Latest News Updates