ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. విజయవాడ రాజ్ భవన్ కు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అయితే.. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పలు అంశాలపై గవర్నర్, సీఎం చర్చించుకున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు వీరిద్దరి భేటీ సాగింది.