2017లో మురుగా మఠం ఇచ్చిన బసవశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రముఖ జర్నలిస్టు రామన్ మెగాసేసే అవార్డు గ్రహీత పీ సాయినాథ్ ప్రకటించారు. మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణుపై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సాయినాథ్ తెలిపారు. బాధితులకు సంఫీుభావం తెలిపిన సాయినాథ్ బసవశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నాని, 5 లక్షల ప్రైజ్ మనీ కూడా ఇచ్చేస్తున్నట్లు తెలిపారు. పోక్సో చట్టం కింద మఠాథిపతి శరణారు కేసులు ఎదుర్కోవడం తనను ఎంతగానో డిస్టర్బ్ చేసినట్లు తెలిపారు. పిల్లలపై అలాంటి అఘాయిత్యాలు జరిగే సహించేది లేదని, ఖండిరచడానికి పదాలు కూడా లేవన్నారు.