నేటి నుంచే రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’… కన్యాకుమారి నుంచి మొదలు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భారత్ జోడో యాత్ర నేటి నుంచే ప్రారంభం కానుంది. కన్యాకుమారి నుంచే ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ చెన్నైలోని పెరంబదూర్ లో వున్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని సందర్శించారు. స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సుదీర్ఘంగా ఈ యాత్ర కొనసాగుతుంది. 3,570 కిలోమీటర్ల మేర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా రాహుల్ యాత్ర సాగుతుంది.

 

తిరువల్లూర్ మెమోరియల్ ను రాహుల్ సందర్శిస్తారు. ఆ తర్వాత కామరాజ్ మెమోరియల్‌ను సందర్శించి, సాయంత్రం 4.10గంటలకు మహాత్మాగాంధీ మండపం వద్ద ప్రార్థనలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు మహాత్మాగాంధీ మండపంలో తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ రాహుల్ గాంధీకి జాతీయ జెండా అందజేస్తారు. 4.40 గంటలకు భారత్ జోడో యాత్రికులతో కలిసి మహాత్మా గాంధీ మండపం నుంచి బీచ్ రోడ్ వరకు జరిగే మార్చ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5గంటలకు కన్యాకుమారికి చేరుకొని భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ యాత్ర ప్రారంభంలో భాగంగా తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ సీఎంలు పాల్గొననున్నారు.

 

Related Posts

Latest News Updates