కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పున్నమాడ సరస్సులో జరిగిన స్నేక్ బోట్ రేసులో రాహుల్ ఉత్సాహంగా పాల్గొన్నారు. పడవ సిబ్బందితో కలిసి, రాహుల్ తెడ్డు వేశారు. ఈ రేసులో రెండు బోట్లు పాల్గొనగా రాహుల్ ఉన్న బోట్ విజయం సాధించింది.స్నేక్ బోట్ రేసులో రాహుల్ గాంధీ పాల్గొన్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాలను సమూలంగా మార్చేస్తుందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలో కొనసాగుతున్న రాహుల్ యాత్రలో సోమవారం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన రేవంత్… రాహుల్ యాత్రకు భారీగా స్పందన వస్తోందని చెప్పారు. బీజేపీ విభజన రాజకీయాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల నుంచి దేశాన్ని కాపాడేందుకు దేశ నలుమూలల నుంచి అనేక మంది రాహుల్ యాత్రలో పాలుపంచుకుంటున్నారని రేవంత్ స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 7 న తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన శ్రీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అశేష జనాభిమానాన్ని చూరగొనడం భారత భవిష్యత్ రాజకీయా మార్పులకు సంకేతం.
ఈ సందర్భంలో కేరళలో జరుగుతోన్న శ్రీ రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.#BharatJodoYatra pic.twitter.com/crvVeflktv
— Revanth Reddy (@revanth_anumula) September 19, 2022