బ్రిటన్ రాణి ఎలిజిబెత్2 అంత్యక్రియలు ముగిశాయి. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో జరిగిన ఈ అంత్యక్రియలకు ప్రముఖులు హాజరయ్యారు. భారత్ నుంచి రాష్ట్రపతి ముర్ము, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తో సహా పలు దేశాధినేతలు, రాజులు, రాణులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రాచరికపు సంప్రదాయాలతో పాటు ఆచార వ్యవహారాలను జాగ్రత్తగా పాటిస్తూ.. రాణి అంత్యక్రియలు జరిగాయి. బ్రిటన్ జాతీయ జెండాలను పట్టుకొని, సైనికుల మధ్య నుంచి శవ పేటికను 6000 మందితో కూడిన భారీ సైనిక కవాతుతో ఊరేగింపుగా వెళ్లారు. అంతేకాకుండా.. రాణి 96 సంవత్సరాలు జీవించారు కాబట్టి… బిగ్ బెన్ గంటలను 96 సార్లు మోగించారు.
వెస్ట్ మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్ మినిస్టర్ అబే వరకూ ఊరేగింపుగా రాణి శవపేటికను ఊరేగింపుగా తీసుకెళకలారు. అక్కడి నుంచి రాణి అంతిమ యాత్ర వెల్లింగ్టన్ అర్చి వరకూ సాగింది. చివరగా.. రాయల్ వాల్ట్ లో క్వీన్ ఎలిజిబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ ను ఉంచిన దగ్గరే రాణి శవ పేటికను కూడా వుంచారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత అందరూ మౌనం పాటించారు. ఈ అంత్యక్రియల్లో కింగ్ ఛార్లెస్3 తో పాటు ఇతర రాజవంశీయులు కూడా పాల్గొన్నారు.