అక్టోబర్ 11 నుంచి 15 వరకు “శ్రీ వెంకటేశ్వర వైభోత్సవాలు” పేరుతో తిరుమలలో శ్రీనివాసునికి జరిగే నిత్య కైంకర్యాలు హైదరాబాద్ ప్రజల ముంగిటకు రానున్నాయి. టీటీడీ వారి సౌజన్యంతో శ్రీ ముప్పవరపు హర్షవర్ధన్ దంపతులు (హర్ష టయోట), వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి దంపతులు, అపర్ణ బిల్డర్స్ వెంకటేశ్వర రెడ్డి దంపతులు తీసుకువస్తున్నారు. ఇక సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు అందరూ కనులారా తిలకించవచ్చని వారు తెలిపారు. నాలుగు రోజుల పాటు భాగ్యనగరం గోవిందా నామస్మరణతో మారుమోగనుంది.

 

తిరుమల శ్రీవారి ఆనంద నిలయాన్ని మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న NTR Stadiam లో చూడవచ్చు. ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఆనంద నిలయంలో (నమూనా ఆలయం)లో TTD అర్చకులే స్వామివారికి నిత్య కైంకార్యాలు చేస్తారు, అందరికీ ఇష్టమైన తిరుపతి లడ్లు, ఇతర స్వామివారి ప్రసాదాలు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు సూచించారు. 6 సంవత్సరాల క్రితం అచ్చు ఇలాగే నిర్వహించారు. మళ్లీ 6 సంవత్సరాలకు ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ముందుకు వచ్చారు.