ఉక్రెయిన్ లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనమయ్యాయి.. పుతిన్ ప్రకటన

ఉక్రెయిన్ లోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో ఆక్రమించిన ప్రాంతాలు రష్యాలో విలీనమయ్యాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ లోని జపోరిజియా, ఖేర్సన్, లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాలు రష్యాలో విలీనమయ్యాయని ప్రకటించారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే ఈ నాలుగు ప్రాంతాలను తాము విలీనం చేసుకున్నామని పుతిన్ ప్రకటించారు. ఈ విలీన కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొన్నారు. ఈ మేరకు మాస్కో అనుకూల పరిపాలకులు సంబంధిత ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. రెఫరెండంపై ఉక్రెయిన్ సహా అమెరికా, ఐరోపా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ విలీన ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. సైనిక అధికారులు, ఎన్నికల అధికారులు కూడా ఇంటింటికీ వెళ్లి, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.

Related Posts

Latest News Updates