అంబులెన్స్ కు దారి ఇస్తూ.. పక్కకు ఆగిపోయిన మోదీ కాన్వాయ్.. సోషల్ మీడియాలో వైరల్

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటిస్తున్నారు. రెండో రోజు వివిధ కార్యక్రమాలను ముగించుకొని అహ్మదాబాద్ నుంచి గాంధీనగర్ కు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలోనే ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అంతలోనే అంబులెన్స్ వచ్చింది. దీనిని గమనించిన ప్రధాని నరేంద్ర మోదీ.. వెంటనే తన కాన్వాయ్ ను రోడ్డు పక్కన నిలిపేయాలని ఆదేశించారు. కాన్వాయ్ దాటి.. అంబులెన్స్ బాగా ముందుకు వెళ్లిపోయిన తర్వాత… మోదీ కాన్వాయ్ ముందుకు సాగిపోయింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Posts