పండగ సీజన్లో కేంద్రం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే డీఏ పెంచి ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా.. 11 రకాలైన నిత్యావసర ధరల్ని ఈ నెలలో తగ్గిస్తున్నామని కేంద్ర ఆహార మంత్రి పీయూశ్ గోయల్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. సెప్టెంబర్ 2 నాటికి పామాయిల్ లీటర్ 132 వుండగా… ఇప్పుడు గరిష్టంగా 11 శాతం తగ్గి, 118 రూపాయలకు చేరుకుంది. ఇక.. వనస్పతి నెయ్యి కిలో 152 నుంచి 143 రూపాయలకు దిగొచ్చింది. అంటే 6 శాతం ధర తగ్గింది. ఇక సన్ ఫ్లవర్ ఆయిల్ ధర 176 రూపాయల నుంచి 165 రూపాయలకు తగ్గింది.
సోయాబీన్ ఆయిల్ 156 రూపాయల నుంచి 148 రూపాయలకు చేరింది. ఆవనూనె ధర లీటరు 173 రూపాయల నుంచి 3 శాతం తగ్గి, 167 కి దిగొచ్చింది. పల్లీ నూనె లీటరు 189 నుంచి 2 శాతం తగ్గి, 185 కి తగ్గింది. ఇక.. సామాన్యులకు నిత్యం వాడుకలో వుండే ఉల్లిపాయ ధర కిలో 26 రూపాయల నుంచి 24 రూపాయలకు తగ్గింది. అంటే 8 శాతం మేర తగ్గింది. ఇక..బంగాళ దుంప 28 నుంచి 26 రూపాయలకు తగ్గింది. పప్పు దినులు కిలో 74 నుంచి 71 రూపాయలకు తగ్గింది. మసూర్ దాల్ కిలో 97 నుంచి 3 శాతం తగ్గి, 71 రూపాలకు తగ్గింది. మినప పప్పు కిలో 108 నుంచి 106 రూపాయలకి తగ్గింది.