గుజరాత్ లో గర్భా డ్యాన్స్ సమూహంపై రాళ్లదాడి.. ఆరుగురికి గాయాలు

గుజరాత్ లోని ఖేడా ప్రాంతంలో గర్భా డ్యాన్స్ చేస్తున్న వారిపై దుండగులు రాళ్ల దాడికి దిగారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖేడా జిల్లాలోని మాతర్ తాలూకాలో గ్రామ పెద్ద గర్భా డ్యాన్స్ ఏర్పాటు చేయించాడు. అయితే.. ఇది మసీదుకు దగ్గర ప్రాంతంలో వుంది. గర్భా ఆడుతున్న సమయంలో వెంటనే దానిని ఆపాలని కొందరు హెచ్చరించారు. అంతేకాకుండా గర్బా డ్యాన్స్ చేస్తున్న వారిపై రాళ్ల దాడికి దిగారు. దీంతో 6 గురు తీవ్రంగా గాయపడ్డారు.

 

ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిన్న రాత్రి ఉండేలా గ్రామంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆరిఫ్, జహీర్ అనే ఇద్దరు వ్యక్తులు కొందరి మందితో గర్భా జరిగే ప్రదేశానికి వచ్చారు. ఉత్సవాలు జరిగే ప్రదేశానికి వచ్చారు. అడ్డంకిగా మారారు. దీంతో గ్రామ పెద్దలు, ప్రజలు వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఘటనపై విచారణ జరుగుతోంది అని డీఎస్పీ రాజేశ్ గథియా తెలిపారు.

Related Posts

Latest News Updates