బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ కు కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోదీ

బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన రిషి సునాక్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ సమస్యల పై, 2030 రోడ్ మ్యాప్ పై మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోడీ తెలిపారు. భారత్, బ్రిటన్ ల మధ్య చారిత్రక సంబంధాలను ఆధునిక బంధాలుగా మారుద్దాం అని మోడీ తన ట్వీట్ లో తెలిపారు. ఈ సందర్భంగా బ్రిటన్ లోని భారతీయులకు మోడీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

Related Posts

Latest News Updates