బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  ఆమె నాయకత్వంలో భారత్-బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని  ఆకాంక్షించారు. ప్రధానిగా కొత్త బాధ్యతలు చేపడుతున్న ఆమెకు ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. ఈమేరకు మోదీ ట్వీట్ చేశారు.

 

బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం భారత సంతతికి చెందిన రిషి సునాక్- కన్జర్వేటివ్ పార్టీ నేత లిజ్ ట్రస్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో చివరికి లిజ్ ట్రస్‌నే విజయం వరించింది. రిషిపై ఏకంగా 21 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన లిజ్ బ్రిటన్ నూతన ప్రధానిగా పగ్గాలు సాధించేందుకు సిద్ధమయ్యారు. లీజ్‌ ట్రస్‌కు 81,326 ఓట్లు రాగా.., రిషి సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి. దీంతో 21 వేల ఓట్ల తేడాతో ట్రస్‌ నెగ్గినట్లయ్యింది. ఆన్‌లైన్, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా సుమారు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు ఓటు వేసి లిజ్ ట్రస్ ను ఎన్నుకున్నారు. తనపై విశ్వాసం వుంచిన ప్రజలకు లిజ్ ట్రస్ ధన్యవాదాలు ప్రకటించారు. మరో వైపు లీజ్ ట్రస్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

Related Posts

Latest News Updates