ఐసీయూలో చికిత్స పొందుతున్న ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ములాయం కుమారుడు అఖిలేశ్ కి ఫోన్ చేసిన తండ్రి ఆరోగ్యాన్ని మోదీ అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా.. తాము అందించేందుకు సిద్ధంగా వున్నామని, ఎప్పుడైనా సంప్రదించవచ్చని మోదీ తెలిపారు. మరోవైపు చికిత్స పొందుతున్న ములాయం ఆరోగ్యంపై రక్షణ మంత్రి రాజ్ నాథ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆరా తీశారు. ఇక.. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా ములాయం ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కుమారుడు అఖిలేశ్ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ములాయం ఆరోగ్యం నిలకడగానే వున్నట్లు సమాచారం.