పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీగా రతన్ టాటా….

పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా వుండనున్నారు. వీరితో పాటు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, లోకసభ డిప్యూటీ స్పీకర్ కరియా ముండాతో పాటు పలువురు ప్రముఖులు కూడా వుండనున్నారు. ఇక… మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ మహర్షి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్ సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా కో ఫౌండర్ ఆనంద్ షాలను సలహా మండలి సభ్యులుగా నియమించింది. దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందిన సమయంలో అత్యవసర సహాయ చర్యల కోసం 2020 లో పీఎం కేర్స్ ఫండ్ ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రధాని ఎక్స్ అఫిషియో చైర్ పర్సన్ గా వుంటారు.

 

పీఎం కేర్స్ ఫండ్ లో అంతర్భాగమైన వారందరికీ ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారని, వారిని స్వాగతించారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. నూతన ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యం వల్ల పీఎం-కేర్స్ ఫండ్‌ దృక్పథం మరింత విశాలమవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి విజృంభించిన సమయంలో పీఎం-కేర్స్ నిధిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన మంత్రి ఎక్స్-అఫిషియో చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. దీనికి అందజేసే నిధులపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు.

Related Posts

Latest News Updates