అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ పేరు పెడతాం : లోకేశ్ ప్రకటన

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ తీవ్రంగా మండిపడింది. అదో తుగ్లక్ చర్య అని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా దుయ్యబట్టారు. వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి రాగానే తిరిగి ఎన్టీఆర్ పేరును పెట్టి తీరుతామని ప్రకటించారు. హెల్త్ వర్శిటీకి, వైఎస్సార్ కు ఏం సంబంధం వుందని అలా చేశారు? అంటూ సూటిగా ప్రశ్నించారు. హెల్త్ యూనివర్సిటీని నెలకొల్పింది, అభివృద్ధి చేసింది ఎన్టీఆరేనని, ఈ పేరు మార్పు ద్వారా సీఎం జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని మండిపడ్డారు.

 

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారం మంత్రి రజనీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. ప్రతిపక్షంలో ఉన్నవారికి ఎన్టీఆర్  పేరు గుర్తోస్తోందని, అధికారం ఉంటే ఓ లాగా అధికారం లేకపోతే మరోలా చెపుతారని అన్నారు. ఎన్టీఆర్ మీద జగన్ కి  గౌరవం ఉందని స్పష్టం చేశారు.

Related Posts

Latest News Updates